నేను ఎందుకు పోస్ట్ మెటర్నిటీ కోర్సేట్ ను వాడాలి?
గర్భధారణ సమయంలో, గర్భాశయం యొక్క విస్తరణ ఉదర కండరాలను సాగదీస్తుంది. పెరుగుతున్న పిండంనకు సర్దుబాటు కల్పించేందుకు కటి ప్రాంతం విస్తరిస్తుంది. ప్రసవం తరువాత, గర్భాశయం దాని యొక్క గర్భధారణ-ముందు పరిమాణానికి తిరిగి రావడానికి సుమారు 6 వారాలు పడుతుంది. ప్రసవం తర్వాత ఉదర గోడ కూడా వదులుగా అవుతుంది. ఒక పోస్ట్ మెటర్నిటీ కోర్సేట్ తల్లి యొక్క డెలివరీ-ముందు ఆకారాన్ని తిరిగి పొందే ప్రక్రియను వేగవంతం చేయడానికి సహాయపడే అదనపు మద్దతును మరియు ఒత్తిడిని అందిస్తుంది. సి సెక్షన్ తర్వాత పోస్ట్ మెటర్నిటీ కోర్సేట్ ను వుపయోగించమని సూచించడమైనది. ఈ సందర్భంలో, కోర్సేట్ కోతపెట్టిన భాగానికి మద్దతును మరియు ఒత్తిడిని అందిస్తుంది. ఇది ఆ ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది మరియు వేగంగా నయమవడానికి తోడ్పడుతుంది. ఇదే కారణాల వలన, అటువంటి ఒక కోర్సేట్ ఉదర ప్రాంతంలో కోతలు అవసరమయ్యే ఒక అబ్డోమినోప్లాస్టీ (టమ్మీ టక్), హిస్టేరెక్టమి, లిపోసక్షన్ మరియు బారియాట్రిక్ శస్త్రచికిత్స తర్వాత కూడా ఉపయోగపడుతుంది.